కంది, మార్చి 28 : సాఫీగా సాగుతున్న ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం చిన్నాభిన్నం చేసింది. ఇంటిపెద్ద రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఆ ఇల్లాలు తీవ్రంగా కలత చెంది, కఠిన నిర్ణయం తీసుకున్నది. ఇంద్రకరణ్ ఎస్సై విజయ్‌కుమార్ వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కంది మండలం జుల్కల్కు చెందిన పట్నం ప్రవీణ్‌తో మమత(27)కు 2017లో వివా హం జరిగింది.
ఇద్దరు పిల్లలు మణికంఠ (5), ప్రణయ శ్రీ(2)తో సంతోషంగా జీవితం కొనసాగిస్తున్న సమయంలో రెండు నెలల క్రితం ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. దీంతో మమత మానసికంగా కుంగిపోయింది. శనివారం మధ్యాహ్నం వరకు తలుపులు మూసి ఉండటంతో కుటంబీకులు తలుపులు తొలిగించి చూ డగా.. మమత ఇంట్లో దూలానికి ఉరివేసుకొని విగతజీవిగా ఉండ గా.. పక్కనే ఇద్దరు పిల్లల మృతదేహాలు కనిపించాయి. పిల్లలను గొంతునులిమి చంపి, తాను ఉరివేసుకొన్నట్టు అనుమానిస్తున్నారు.