బిజినపల్లి : ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంబీబీఎస్ ( MBBS ) పూర్తి చేసిన గిరిజన విద్యార్థిని కట్రావత్ శ్యామలను ( Shyamala ) ట్రస్ట్ అధినేత, మాజీ శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి ( Marri Janardhan Reddy ) దంపతులు అభినందించారు. తన ఎంబీబీఎస్ చదువుకు పూర్తి అయ్యేవరకు అండగా నిలిచిన మర్రి జనార్దన్ రెడ్డి దంపతులను మంగళవారం హైదరాబాద్లోని నివాసంలో విద్యార్థిని శ్యామల, ఆమె తల్లి దండ్రులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
బీజినపల్లి మండలంలోని ఊడుగులకుంటా తండాకు చెందిన కట్రావత్ పాండు నాయక్, చంది దంపతుల కుమార్తె కట్రావత్ శ్యామల విద్యార్థినికి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. అయితే ఆ కుటుంబం పేదవారు కావడంతో నాలుగు సంవత్సరాల క్రితం అప్పటి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తన ఎంజెఆర్ ట్రస్ట్ ద్వారా ఎంబీబీఎస్ పూర్తి అయ్యేవరకు చదివిస్తానని హామీ ఇచ్చాడు. ప్రతి సంవత్సరం ఫీజు చెల్లించి ఆమె ఎంబీబీఎస్ పూర్తి అయ్యేవరకు అండగా నిలిచారు.
ఇటీవల శ్యామల ఎంబీబీఎస్ పూర్తి కావడంతో ఆమె తల్లిదండ్రులతో ఎంజేఆర్ ట్రస్ట్ అధినేత మర్రి జనార్దన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలుపగా మర్రి జనార్దన్ రెడ్డి దంపతులు ఎంబీబీఎస్ పట్టా పొందిన శ్యామలను సన్మానించి అభినందించారు. రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులున్నా తనను సంప్రదించాలని ,అండగా ఉంటానని హామీ ఇచ్చారు.