Maripelly Praveen | మెట్పల్లి రూరల్ : జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్లకు చెందిన మరిపెల్లి ప్రవీణ్ ఈ నెల 15న అమెరికాలోని అరిజోనా రాష్ట్రం ఫినిక్స్ నగర శివారులోగల ‘పియస్టెవా’ శిఖరాన్ని అధిరోహించి 108 సూర్యనమస్కారాలు చేశాడు.
ఇప్పటి వరకు ప్రవీణ్ 48 పర్వతాలను అధిరోహించి 108 సూర్య నమస్కారాలను ప్రదర్శించడం విశేషం.