మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ.. పసునూరి నరహరి లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. 45 ఏళ్లుగా అజ్ఞాత జీవితంలో ఉన్న ఆయన తన భార్యతో కలిసి ఆయన పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. 45 ఏళ్లుగా అజ్ఞాత జీవితంలో ఉన్న ఆయన తన భార్యతో కలిసి ఆయన పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.
హనుమకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి గ్రామానికి చెందిన పసునూరి సోమనారాయణ-నర్సమ్మ దంపతులకు నరహరి రెండో కుమారుడు. 1980వ సంవత్సరంలో ఎల్బీ కాలేజీలో డిగ్రీ చదువుతుండగా నక్సల్ విధానాలకు నరహరి ఆకర్షితులయ్యాడు. అప్పటి రాష్ట్ర కార్యదర్శి పులి అంజయ్య, క్రాంతి రణదేవ్ అలియాస్ బక్కన్నతో ఏర్పడిన స్నేహం కారణంగా ఆయన మావోయిస్టు ఉద్యమం వైపు అడుగులు వేశారు. కూలీల రేట్లు పెంచడంతో పాటు భూస్వాములు, రౌడీలకు వ్యతిరేకంగా అప్పట్లో పోరాటం చేశాడు. అనంతరం అడవి బాట పట్టాడు. 1996 నుంచి ఆయన అజ్ఞాతంలోనే ఉన్నాడు. మావోయిస్టు పార్టీలో ప్రస్తుతం ఆయన జార్ఖండ్ ఈస్ట్ రీజినల్ బ్యూరో టెక్నికల్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వరిస్తున్నాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

