Malla Rajireddy | మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి (70) అలియాస్ సాయన్న కన్నుమూసినట్లు తెలుస్తోంది. అనారోగ్య కారణాలతో ఆయన మరణించినట్లు సమాచారం. రాజారెడ్డి మృతిపై ఇప్పటివరకు మావోయిస్టు పార్టీ ఎలాంటి ప్రకటన చేయలేదు.
మల్లా రాజిరెడ్డి స్వస్థలం పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్పూర్ పరిధిలోని శాస్త్రులపల్లి. ఛత్తీస్గఢ్, ఒడిశా దండకారణ్యంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. సంగ్రామ్, సాయన్న, మీసాల సాయన్న, అలోక్, అలియాస్ దేశ్పాండే, సత్తెన్న వంటి పేర్లతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనపై కోటి రూపాయల నజరానా కూడా ఉంది.