సంగారెడ్డి, ఏప్రిల్ 23 : సంగారెడ్డికి చెందిన పట్నం మాన్యత జూనియర్ మిస్ ఇండియా-2023 పోటీల్లో ఫైనల్కు చేరి తెలంగాణ కీర్తిని దేశానికి చాటింది. 2022 నవంబర్లో హైదరాబాద్లో జూనియర్ మిస్ ఇండియా సెమీ ఫైనల్ పోటీల్లో 15 రాష్ర్టాల నుంచి చిన్నారులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి మాన్యత ఫైనల్కు ఎంపికైంది. ఆదివారం ముంబైలో నిర్వహించిన ఫైనల్ పోటీల్లో మాన్యత తొలిరౌండ్లోనే సత్తాచాటింది. మరో రౌండ్లో పాల్గొనాల్సి ఉన్నది. తెలంగాణ తల్లి వేషధారణతో పోటీల్లో పాల్గొన్న ఆమె ఫైనల్లో గెలుపొంది రాష్ర్టానికి కీర్తి కిరీటాలు తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.