హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): దేశానికి అన్నంపెట్టే అన్నదాతలనూ లంచావతారులు వదలడం లేదు. పాస్ పుస్తకం జారీ నుంచి కరెంటు కనెక్షన్ (Current Connection) వరకూ వారిని లంచాల కోసం వేధిస్తున్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న కొం దురు విద్యు త్తు అధికారులు, సిబ్బంది (Electricity Department) ముడుపుల కోసం పీడిస్తున్నారు. ప్రతి పనికీ ఓ రేటు పెట్టి లైన్‌మన్ నుంచి ఇంజినీర్ల వరకూ అక్రమంగా వసూలు చేస్తున్నారు. కేసీఆర్ పాలనలో గత పదేండ్లలో కంటినిండా నిద్రపోయిన రైతన్న.. నేడు కంటిమీద కునుకు లేకు ండా అవస్థలు పడుతున్నాడు. ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ 22 నెలల కాలంలో ఎందరో విద్యుత్తు అధికారులు, సిబ్బంది ఏసీబీకి పట్టుబడ్డారు.
వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్లు, లైన్షిప్టింగ్ వంటి పనుల కోసం రైతు నుంచి పలువురు ఇంజినీర్లు, కిందిస్థాయి సిబ్బంది లంచాలు డిమా ండ్ చేస్తున్నారు. ఇవ్వకపోతే పనులను పెడింగ్‌లో పెడుతున్నారు. వారి వేధింపులు భరించలేక ఇటీవల పలువురు రైతులు అవినీతి నిరోధక శాఖను ఆశ్రయిస్తున్నారు. మంగళవారం ఓ రైతు నుంచి లంచం పుచ్చుకుంటూ ఒక లైన్మెన్ ఏసీబీకి చిక్కడం సంచలనం సృష్టిచింది. అత్యంత వెనుకబడిన ప్రాంతమైన నాగర్‌కర్నూల్ జిల్లాలో వ్యవసాయ ఫీడర్‌కు ట్రాన్స్ఫార్మర్ బిగించేందుకు లంచం డిమాండ్ చేశారు. సంబంధిత రైతు నుంచి రూ.15 వేలు తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా ఆ లైన్మెన్ను పట్టుకున్న ఘటనే తాజా ఉదాహరణ. ఒక్క లైన్మెన్ రూ.15 వేలు తీసుకుంటే మిగతా అధికారులు ఎంత డిమాండ్ చేస్తారో ఊహించుకోవచ్చు.
రైతుల నుంచి అక్రమ వసూళ్లు
గతంలో వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్ల కోసం ఏ నెలలో దరఖాస్తు చేస్తే, అదే నెలలో కొత్త కనెక్షన్లు జారీ అయ్యేవి. ఇప్పుడు కొత్త కనెక్షన్ల జారీకి 6 నుంచి 8 నెలలు పడుతున్నది. వ్యవసాయ కనెక్షన్ల జారీపై ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించేవారు. ఇప్పుడు సమీక్షలు నిర్వహించిన దాఖలాలే లేవు. కొత్త కనెక్షన్లకు ఇచ్చే సగం మెటీరియల్‌ను సిబ్బంది బయట అమ్ముకుని, ఆ సగం రైతులతోనే కొనిపిస్తున్నారు. నిజానికి ట్రాన్స్ఫార్మర్ దిమ్మె కడితే రూ.20 నుంచి రూ.22వేలు, లేబర్ చార్జీల కింద మరో రూ.20 వేలను ఇస్తారు. ఇదే కాకుండా గుంత తవ్వకానికి, సపోర్టు తీగ, ఏబీ స్విచ్ ఇలా ప్రతి దానికీ ఒక రేట్ ఉంటుంది. కానీ, రైతుల అమాయకత్వాన్ని, వారి అవసరాన్ని ఆసరా చేసుకొని వీటికోసం అని రైతుల నుంచే అక్రమంగా పలుచోట్ల సిబ్బంది డబ్బు వసూలు చేస్తున్నారు. ఓవర్‌హెడ్ కేబుల్ అందుబాటులో లేదని, పోల్స్ ఉంటే, కండక్టర్ లేదని, ఇవన్నీ ఉంటే ఏబీ స్విచ్ లేదని సాకులు చూపి రైతుల చేతే కొనిపిస్తున్నారు. డిస్కం నుంచి వచ్చే మెటీరియల్‌ను పక్కదారి పట్టిస్తున్నారు.
రైతులకు ఈ విషయం తెలియాలి!
రైతులు కొత్త విద్యుత్తు కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్ల కోసం విద్యుత్తు ఇంజినీర్లు, సిబ్బందికి రూపాయి ఇవ్వాల్సిన అవసరమే లేదు. వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసి, అన్ని రకాల అర్హతలు ఉంటే విద్యుత్తు శాఖ ఆధ్వర్యంలోనే కచ్చితంగా స్తంభాలు, లైన్లు వేయాలి. ఒక్కో రైతు దరఖాస్తు ఫాం రుసుం కింద రూ.25, సెక్యూరిటీ డిపాజిట్ రూ.300, డెవలప్మెంట్ చార్జీలుగా రూ.4,625 కలిపి మొత్తంగా రూ.4.950 చెల్లించాల్సి ఉంటుంది. దూరం ఎక్కువైతే ఓఆర్సీ అమౌంట్ కింద మరికొంత చెల్లించాల్సి ఉంటుంది. కావాల్సిన మెటీరియల్ అంతా విద్యుత్తు సంస్థల అధికారులే సమకూర్చుతారు. కొత్త వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ కోసం నలుగురు రైతులు రూ.25 వేలు చెల్లిస్తే సరిపోతుంది. నాలుగైదు స్తంభాలు, కండర్టర్ (కేబుల్) అంతా డిస్కం అధికారులే సమకూరుస్తారు. ఇప్పటికే ఉన్న ట్రాన్స్ఫార్మర్ కాలిపో తే డిస్కం అధికారులే పూర్తి ఉచితంగా బిగించాల్సి ఉంటుంది. అంతా కాంట్రాక్టర్లే చేస్తారు. పైనుంచి బిల్లులు పెట్టుకుంటారు. కానీ, అధికారులు, కాంట్రాక్టర్లు, కిందిస్థాయి సిబ్బంది పెద్ద మాఫియాలా తయారై రైతన్నలను దోపిడీ చేస్తున్నరు. పనిచేసినందుకు రైతుల నుంచి వేలకు వేలు డిమాండ్ చేస్తున్నారు.
పట్టుబడిన కొందరు లంచావతారులు