కేసముద్రం, నవంబర్ 4: కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో నడి చే సెంట్రల్ సిల్క్ బోర్డ్ మ్యాగజైన్‌కు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ధన్నసరి గ్రామానికి చెందిన పట్టు రైతు వేం పార్థసారథి సక్సెస్ స్టోరీ ఎంపికైంది. ఈయన పట్టు పురుగుల పెంపకం కేంద్రం (చాకి రేరింగ్ కేంద్రం) నిర్వహిస్తున్నారు. కూలీలకు ఉపాధి కల్పించడంతోపాటు పట్టు పురుగులను పెంచి మల్బరీ రైతులకు పంపిణీ చేస్తుంటారు. రాష్ట్రంలో అతి కొద్దిమంది చాకి రేరింగ్ రైతుల్లో పార్థసారథి ఒకరు. పట్టు పురుగుల పెంపకంలో ఆదర్శంగా నిలిచిన యువ రైతు పార్థసారథి సక్సెస్ స్టోరీ సెంట్రల్ సిల్క్ బోర్డ్ మ్యాగజైన్లో త్వరలో ప్రచురితం కానున్నది.