హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): ప్రపంచ ప్రసిద్ధిపొందిన కార్నింగ్ ఇన్ కార్పొరేటెడ్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. నైపుణ్యాలతోపాటు పరిశ్రమల్లో సాంకేతిక ఆవిషరణలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. అమెరికా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబుతో ఎమర్జింగ్ ఇన్నోవేషన్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రోనాల్డ్ వెర్లీర్కన్, కార్నింగ్ ప్రతినిధుల బృందం చర్చలు జరిపింది. అనంతరం అవగాహన ఒప్పందపత్రాలపై సంతకాలు చేశారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురసరించుకుని చేనేత కార్మికులందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మహిళా శక్తి గ్రూపులు, ప్రభుత్వశాఖల ద్వారా చేనేతను ప్రోత్సహించే కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకా రం చుట్టిందని పేరొన్నారు.