Krishank | పోలీసులా? కాంగ్రెస్ సైనికులా? క్రిశాంక్ తరలింపులో నిబంధనల ఉల్లంఘనపై రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు
రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీస్ శాఖ.. అధికార పక్షానికి కొమ్ముకాస్తున్న వైనంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
- చట్టాలను చుట్టేస్తున్న పోలీస్‌శాఖ
- మన్నె క్రిశాంక్‌ను సంగారెడ్డి జైలు నుంచి నిర్మల్ కోర్టుకు ప్రైవేట్ వాహనంలో తరలింపు
- క్రిశాంక్ తరలింపులో నిబంధనల ఉల్లంఘనపై రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు
హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీస్ శాఖ.. అధికార పక్షానికి కొమ్ముకాస్తున్న వైనంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌పై పోలీసులు చూపుతున్న వైఖరి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నది. ఆయనను సంగారెడ్డి జైలు నుంచి నిర్మల్ కోర్టుకు తరలించిన తీరు, పోలీసుల అత్యుత్సాహం వెనుక ఉన్న అసలు ఉద్దేశాలను నెటిజన్లు సైతం ప్రశ్నిస్తున్నారు.
నిందితులను లేదా ఖైదీలను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించేటప్పుడు ప్రభుత్వ అధికారిక వాహనాలను (పోలీస్ ఎస్కార్ట్ వాహనాలు) వినియోగించడం ప్రాథమిక సూత్రం. కానీ, క్రిశాంక్‌ను తరలించడానికి ఒక టాటా టియాగో ప్రైవేట్ కారును ఉపయోగించడం వెనుక ఉన్న మర్మమేమిటి? ఆ కారు ఎవరిది? అని ప్రశ్నిస్తున్నది. ప్రభుత్వ రవాణా వ్యవస్థ అందుబాటులో లేనంత దైన్యస్థితిలో పోలీస్ శాఖ ఉన్నదా? గుర్తు తెలియని వ్యక్తుల వాహనాల్లో తరలించడం వల్ల సదరు నిందితుడి ప్రాణాలకు ముప్పు వాటిల్లితే బాధ్యత ఎవరిది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినంత మాత్రాన అక్రమంగా అరెస్టులు చేయొద్దని కోర్టులు స్పష్టంగా 8 మార్గదర్శకాలను రూపొందించాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shashi Tharoor | ఎమర్జెన్సీ కాదు.. ఇది ఎమర్ జెన్ జీ.. ఢిల్లీలో పోలీసుల దిగ్బంధనంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

