హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకండా కురుస్తున్న వర్షాలకు(Heavy rain) వాగులు, వంకలు పొంగి పొర్లు తున్నాయి. చెరువులు, కుంటలు అలుగు దుంకుతున్నాయి. పలు చోట్ల చెట్లు విరిగిపడి, కరెంట్ స్తంభా లు నేలకూడలంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చెరువులు అలుగులు పారుతున్నాయి.
కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో నాగర్‌కర్నూల్ జిల్లాలో మన్ననూర్ చెక్ పోస్ట్‌ను(Mannanur Check Post) అధికారులు మూసివేశారు. అధిక వర్షపాతం కారణంగా ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగి పడుతున్నాయి. ఈ కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున శ్రీశైలం వెళ్లే భక్తులు, పర్యాటకులు రావద్దని, మన్ననూర్ చెక్ పోస్టును తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు.