నార్నూర్ : స్థానిక పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మాన్కాపూర్ ( Mankapoor ) గ్రామపంచాయతీలో సర్పంచ్, 8 మంది వార్డు సభ్యులను గ్రామస్థులు ఏకగ్రీవ ఎన్నికకు(Unanimously Elect) తీర్మానం చేశారు. శనివారం నామినేషన్ల ( Nominations) కు చివరి రోజు కావడంతో వారంతా నామినేషన్ కేంద్రంలో సర్పంచ్ అభ్యర్థి తోడసం రేణుకా, వార్డ్ సభ్యుల స్థానాలకు ఒక్కొక్కరు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు.
సింగిల్ నామినేషన్ దాఖలు కావడంతో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు వేసిన అభ్యర్థులకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ తోడసం నాగరావ్, మేస్రం రూప్ దేవ్ పటేల్, మెస్రం మోతిరామ్ పటేల్, రాథోడ్ దిగంబర్ నాయక్, కోట్నాక్ నానాజీ, కోట్నాక్ నాగోరావ్, ఆత్రం భీంరావ్, కోట్నాక్ పవన్ కుమార్, రాథోడ్ ప్రదీప్, కరీం ఖాన్, కేశవ్, సోము, యువకులు పాల్గొన్నారు.