Manipur Violence | మణిపూర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చదువుకునేందుకు వెళ్లిన విద్యార్థులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు ప్రత్యేక విమానాలను పంపి.. తెలంగాణ విద్యార్థులతో పాటు తెలుగు విద్యార్థులను సైతం హైదరాబాద్‌కు తరలించేందుకు చర్యలు చేపట్టింది.
న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌తో పాటు హైదారాబాద్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఇంఫాల్ నుంచి హైదరాబాద్‌కు తెలంగాణ విద్యార్థులు సురక్షితంగా తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మణిపూర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సంప్రదించి అవసరమైన తీసుకుంటున్నారు. మరో వైపు విద్యార్థుల భద్రతపై మణిపూర్ రాష్ట్ర పోలీసులతో డీజీపీ అంజనీకుమార్ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు.
అక్కడ చిక్కుకుపోయిన విద్యార్థులను కోల్‌కతా మీదుగా హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 8 గంటల తర్వాత ఇంఫాల్ నుంచి విమానం బయలుదేరే అవకాశం ఉందని సమాచారం. మధ్యాహ్నం వరకు శంషాబాద్ చేరుకునే అవకాశం ఉంది. అయితే, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న హర్ష వర్ధన్ అనే విద్యార్థి చేరుకోగా.. ఇవాళ రాత్రికి తెలంగాణ భవన్లో అధికారులు బస ఏర్పాటు చేశారు.