తాండూరు, ఫిబ్రవరి 13: వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలను తారుమారు చేసేందుకు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ప్రయత్నించారంటూ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం సమీపంలో నిరసన తెలిపారు.
ఎమ్మెల్యే వైఖరిని నిరసిస్తూ గంటకుపైగా బైఠాయించారు. కౌంటింగ్ పూర్తి కాకముందే పోలీసులు ఎమ్మెల్యేను ఎలా లోపలికి అనుమతిస్తారని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సమయంలో పోలీసులకు, మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.