న్యూఢిల్లీ: ‘మ్యానిఫెస్ట్(manifest)’ పదం ఈ ఏడాది కేంబ్రిడ్జ్ నిఘంటువు ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్’గా ఎన్నికైంది. ఈ ఏడాది 130,000 సార్లు ఈ పదం కోసం కేంబ్రిడ్జ్ డిక్షనరీ వెబ్సైట్లో వెతుకులాట జరిగింది. సోషల్ మీడియాలో ఈ పదం చాలాసార్లు ప్రస్తావనకు వచ్చింది. ఈ పదానికి ఉన్న క్రియ అర్థం ‘ఒక విషయాన్ని సంకేతాలు, చర్యలు ద్వారా స్పష్టంగా చూపించడం’. అయితే ఈ పదాన్ని ఈ ఏడాది పదంగా ఎన్నుకోవడానికి కారణం దీని కొత్త అర్థం. ‘టు మ్యానిఫెస్ట్’ పదాన్ని ‘నువ్వు కోరుకున్నది సాధించాలని ఊహించడం, ఆ విధంగా నమ్మకంతో దాన్ని చేయడం వల్ల అది సంభవించేలా చేయడం’ అనే అర్థంలో వాడుతున్నారు.