హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): విత్తన రంగంలో విశేష కృషి చేసినందుకు నూజివీడు సీడ్స్ కంపెనీ చైర్మన్ మండవ ప్రభాకర్‌రావుకు జీవిత సాఫల్య పురస్కారం లభించింది. బుధవారం నగరంలో జరిగిన అగ్రిబిజినెస్ సమ్మిట్‌లో ప్రభాకర్‌రావుకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి వ్యవసాయంలో పీజీ పట్టా పొందిన ఆయన, ఎన్‌ఎస్‌ల్ కంపెనీని స్థాపించి రైతులకు మేలురకమైన విత్తనాలు అందించేందుకు కృషి చేశారు.