బీజేపీపై సింగరేణి తిరుగుబాటు
సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై కార్మిక లోకం భగ్గుమన్నది. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ ప్రయత్నాలపై రగిలిపోతున్న కార్మికులు బుధవారం మందమర్రి ఏరియాలో బీజేపీ నేతల భరతం పట్టారు. బీఎంఎస్ ఆధ్వర్యంలో కేకే 5 గనికి చేరుకొన్న సింగరేణి యాత్రను అడ్డుకొన్నారు.
- బొగ్గు బ్లాకుల వేలంపై కోల్‌బెల్ట్ కన్నెర్ర
- మందమర్రిలో బీఎంఎస్ మీటింగ్‌ను అడ్డుకొన్న కార్మికులు
- ఆ పార్టీ నేత వివేక్‌పై మండిపాటు.. వెళ్లిపోవాలని హెచ్చరిక
- దెబ్బకు తోక ముడిచిన వివేక్ అండ్ బ్యాచ్
మంచిర్యాల, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై కార్మిక లోకం భగ్గుమన్నది. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ ప్రయత్నాలపై రగిలిపోతున్న కార్మికులు బుధవారం మందమర్రి ఏరియాలో బీజేపీ నేతల భరతం పట్టారు. బీఎంఎస్ ఆధ్వర్యంలో కేకే 5 గనికి చేరుకొన్న సింగరేణి యాత్రను అడ్డుకొన్నారు. బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్‌కు ఝలక్ ఇచ్చారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకొని, బొగ్గు బ్లాకులను వేలం పెట్టి సిగ్గు లేకుండా మీటింగులు పెడుతున్నారా? అని నిలదీశారు.
సింగరేణిని అంబానీ, అదానీలకు కట్టబట్టేందుకు యాత్రలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. సింగరేణి వినాశనాన్ని కోరుకొంటున్న బీజేపీ, దాని తోక యూనియన్ బీఎంఎస్‌కు ఈ ప్రాంతంలో తిరిగే అర్హతలేదని స్పష్టం చేశారు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కార్మికుల ప్రతిఘటనతో కంగుతిన్న వివేక్.. అనుచరులతో అక్కడి నుంచి జారుకొన్నారు.
ఎక్కడికక్కడ నిలదీయాలి
తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీయాలని చూస్తున్న బీజేపీ నేతలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలి. సింగరేణిని ప్రైవేటుపరం చేయాలని చూస్తున్న బీజేపీకి ఈ ప్రాంతం లో తిరిగే అర్హత లేదు. ఓ వైపు తెలంగాణ బొగ్గు బ్లాక్‌లను వేలంలో పెట్టి మరోవైపు కార్మికులను మభ్యపెట్టేందుకు దొంగయాత్రలు చేస్తున్నారు. సంస్థపై, కార్మికుల సమస్యలపై కనీస అవగాహన లేకుండా, సిగ్గు లేకుండా మాజీ ఎంపీ వివేక్.. ఈ ప్రాంతంలో తిరుగుతున్నారు. సింగరేణి కార్మికుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం, పార్టీ, టీబీజీకేఎస్ దేనికైనా తెగిస్తుంది.
– ప్రభుత్వ విప్ బాల్క సుమన్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

