Mancherial | అదనపు కట్నం కోసం అత్తమామలను కాల్చిన అల్లుడు
అదనపు కట్నం కోసం అత్తమామలపై నాటుతుపాకీతో దాడికి యత్నించాడు ఓ అల్లుడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం సాలిగామలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్నది. బెల్లంపల్లి మండలం మాలగురిజాలకు చెందిన గోమాస నరేందర్.. సాలిగామకు చెందిన గోలేటి శంకర్ కూతురు బేబీని 2016లో పెండ్లి చేసుకొన్నాడు. కరీంనగర్లో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు.
Mancherial | మంచిర్యాల, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అదనపు కట్నం కోసం అత్తమామలపై నాటుతుపాకీతో దాడికి యత్నించాడు ఓ అల్లుడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం సాలిగామలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్నది. బెల్లంపల్లి మండలం మాలగురిజాలకు చెందిన గోమాస నరేందర్.. సాలిగామకు చెందిన గోలేటి శంకర్ కూతురు బేబీని 2016లో పెండ్లి చేసుకొన్నాడు. కరీంనగర్లో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు.
వివాహమైనప్పటి నుంచి నరేందర్ అదనపు కట్నం తీసుకురావాలని, అత్తమామల పేరుపై ఉన్న ఆస్తి రాయించుకోవాలని భార్యను వేధిస్తున్నాడు. ఈ విషయంలోనే గతంలో ఓసారి అత్తమామలపై గొడ్డలితో దాడిచేసేందుకు యత్నించినట్టు సమాచారం. అల్లుడు కావడంతో అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. తాజాగా.. మంగళవారం భార్యతో గొడవపడిన నరేందర్.. అత్తమామలను హతమార్చేందుకు స్నేహితుడు మహేశ్తో కలిసి సాలిగామకు వచ్చాడు. వెంట తెచ్చుకొన్న చిన్న వెపన్తో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. అప్పటికే అప్రమత్తమైన అత్తమామలు ఊర్లోకి పరుగెత్తారు. కాగా.. నరేందర్ గన్ను బీహార్ నుంచి సమకూర్చుకొన్నట్టు సమాచారం. ముందు తుపాకీ కొని ఆ తర్వాత బుల్లె ట్లు సమకూర్చుకున్నాడని, గన్తో ఎలా కాల్చాలో తెలియక.. కరీంనగర్ పేపర్ ప్లేట్ల ఫ్యాక్టరీలో తనతో పనిచేసే బీహార్ స్నేహితుల దగ్గర శిక్షణ తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఈ ఘటనలో నరేందర్పై కేసు నమోదు చేసి, గాలిస్తున్నామని
ఏసీపీ రవికుమార్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

