అమ్మాయిగా, అబ్బాయిగా డబుల్ రోల్

- సోషల్‌మీడియా వేదికగా యువతుల ట్రాప్
- నగ్న వీడియోలు సేకరించి బ్లాక్మెయిల్
- బాలిక ఫిర్యాదుతో వెలుగుచూసిన మోసాలు
- వరంగల్‌కు చెందిన సైబర్ చీటర్ అరెస్ట్
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): అమ్మాయిగా, అబ్బాయిగా సోషల్‌మీడియాలో డబుల్ గేమ్ ఆడు తూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న యువకుడిని సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. వరంగల్ జిల్లా పరకాలకు చెందిన పాలకుర్తి అజయ్ దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటూ మల్టీమీడి యా కోర్సు చేస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అమ్మాయిలు, అబ్బాయిల ప్రొఫైల్స్‌తో ఖాతాలు తెరిచాడు. వాటితో యువతులు, మైనర్లకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి, స్నేహం ముసుగులో సెక్స్ చాట్ చేసేవాడు. అలా రఫీపాషా పేరుతో ఇన్స్టాగ్రామ్ ఖాతా తెరిచిన అజయ్.. బాలికతో ఫ్రెండ్షిప్ చేసి ఆమెను ముగ్గులోకి దిం పాడు. సెక్స్ చాట్ చేసి బాధితురాలి నగ్న ఫొటోలు, వీడియోలు సేకరించాడు. వాటితో బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేశాడు. ఆ బాధితురాలికి యువతిలా పరిచయమై చాటింగ్ చేశాడు. వాడిచేతిలో తాను కూడా బ్లాక్‌మెయిలింగ్‌కు గురయ్యాయని, వాడికి రూ.9 వేలు ఇస్తే సరిపోతుందని నమ్మించాడు. నువ్వు మూడు వేలు ఇవ్వు.. కావాలంటే నేను మిగతావి ఇచ్చేస్తా అని చెప్పటంతో బాధితురాలు రూ.3 వేలు తీసుకెళ్లి బ్లాక్‌మెయిలర్ చెప్పినట్టు దిల్‌సుఖ్‌నగర్‌లో బస్టాప్ వద్ద పెట్టింది. రెండు రోజులకు మరో ఆరువేలు ఇవ్వాలని అజయ్ డిమాండ్ చేశాడు. బాధితురాలికి ఏం చేయాలో తెలీక ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ను ఆశ్రయించింది. అక్కడి అధికారుల సూచనతో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అసలు విషయం బయటపడింది. నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేయగా 7 ఇన్స్టాగ్రామ్, 7 ఫేస్బుక్ ఖాతాలు ఉన్నట్టు తేలింది. అజయ్ బాధితులు దాదాపు 200 మంది ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

