సోషల్‌మీడియా లైక్‌ల కోసం ఓ యువకుడి వికృత చేష్ట
హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): సోషల్‌మీడియాలో లైక్‌ల కోసం, ఒక్కసారిగా పాపులర్ అయ్యేందుకు ఓ యువకుడు ఏ కంగా బతికున్న పాము తలను పరపర నమిలేశాడు. పాము గిలగిలా కొట్టుకుంటూ మెలికలు తిరుగుతున్నా.. నోట్లోకి కుక్కుకున్నాడు. ఆపై అంతా చూ డండి అంటూ ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్ హైదరాబాద్ వర్షన్’ అనే ట్యాగ్‌లైన్‌తో ఆ వీడియోను సోషల్‌మీడియాలో అ ప్లోడ్ చేశాడు. ఇది వైరల్‌గా మారింది. ‘అరేయ్ సాజిద్.. నీళ్ల బాటిల్ తీసుకురా రా..!’ అంటూ తన మిత్రులను ఆదేశిస్తుండటం వీడియోలో వినిపిస్తున్నది. దీనిపై జంతుప్రేమికులు మండిపడుతున్నారు. సదరు యువకుడిని శిక్షించాలని కోరుతూ ఫారెస్ట్ అండ్ వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ.. ట్విట్టర్ ద్వారా డీజీపీ, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పోలీసులు ఆ యువకుడిని పట్టుకు నే పనిలో ఉన్నారు. ‘అది ఎక్కడ జరిగిందో ప్రాథమిక వివరాలు ఇవ్వండి’ అంటూ హైదరాబాద్ పోలీసులు ట్వీట్ కూడా చేశారు.