గౌతంనగర్, ఫిబ్రవరి 13: ఫేస్బుక్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటో మార్ఫింగ్తోపాటు అనుచిత వ్యాఖ్యలు పోస్టుచేసిన వ్యక్తిని నేరేడ్మెట్ పోలీసులు అరెస్టు చేశారు. సీఎం కేసీఆర్ ఫొటో మార్ఫింగ్తోపాటు ఫేస్బుక్లో పోస్టు పెట్టిన ఓల్డ్ నేరేడ్మెట్ ప్రాంతానికి చెందిన అక్కారం సాయిరాం (27)పై కేసు నమోదుచేసి ఆదివారం రిమాండ్కు తరలించినట్టు ఇన్స్పెక్టర్ నర్సింహస్వామి తెలిపారు.