ఖమ్మం: జిల్లాలోని మధిర రైల్వేస్టేషన్ వద్ద రైలు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. శనివారం తెల్లవారుజామున రైల్వేస్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి పట్టాలు దాటుతున్నాడు. ఈ క్రమంలో అతడిని రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే ప్రమాదం జరిగి గంటలు గడుస్తున్నప్పటికీ మృతదేహాన్ని రైల్వే సిబ్బంది పట్టాలపైనుంచి తొలగించలేదు. దీంతో ప్రమాదం జరిగిన ట్రాక్‌పై స్టేషన్ మాస్టర్ రైళ్ల రాకపోకలు నిలిపివేశారు.