హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): ఆలిండియా బజ్మే రహ్మతే ఆలం సంస్థ ఏటా అందజేసే శాంతి పురస్కారానికి ఈ ఏడాది ప్రముఖ పాత్రికేయుడు, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్, బుద్ధవనం ప్రాజెక్టు ఓఎస్డీ మల్లేపల్లి లక్ష్మయ్య ఎంపికయ్యారు.
మత సామరస్యం, సమాజసేవను ప్రోత్సహించే ప్రముఖ వ్యక్తులకు పురస్కారం ప్రదానం చేస్తున్నామని సంస్థ అధ్యక్షుడు ఎంఏ ముజీబ్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మిలాద్ ఉన్ నబీని పురస్కరించుకొని అక్టోబర్ 9న మల్లేపల్లి లక్ష్మయ్యకు అవార్డును ప్రదానం చేయనున్నట్టు తెలిపారు.