బడంగ్‌పేట, నవంబర్ 13: తెలంగాణలో బీజేపీని బొంద పెట్టడానికి ప్రజలు సిద్ధమవుతున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి కృష్ణ చెప్పారు. రాష్ట్రంలో కుల, మతాల మధ్య అలజడికి ప్రధాని మోదీ కుట్ర పన్నారని మండిపడ్డారు. అందులో భాగంగానే మాల మాదిగల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు.
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందు కు వర్గీకరణ అంశం గురించి మాట్లాడటం లేదని నిలదీశారు. మంద కృష్ణ మాదిగను ముందు పెట్టుకొని మోదీ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ అంశం సుప్రీంకోర్టు చెల్లదని చెప్పిన తర్వాత మరోసారి మోదీ కుల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దళితుల మధ్య ఐక్యతను దెబ్బతీయడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. మాలలు ఎవరూ బీజేపీకి ఓట్లు వేయవద్దని పిలుపునిచ్చారు.