హిమాయత్‌నగర్, డిసెంబర్ 5: రాష్ట్రంలో ఆటోడ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం(ఈనెల 7న) నిర్వహించే ఆటోబంద్‌ను విజయవంతం చేయాలని తెలంగాణ ఆటోరిక్షా డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీ వెంకటేశం పిలుపునిచ్చారు. హిమాయత్‌నగర్‌లోని ఎస్ఎన్రెడ్డిభవన్లో గురువారం మీడియాతో మాట్లాడారు. సామాజిక భద్రత కోసం సంక్షేమబోర్డును ఏర్పా టు చేసి ఏడాదికి రూ.15 వేల ఆర్థికసాయం అందించాలని డిమాండ్ చేశా రు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఆటోమీటర్ చార్జీలు పెంచి, కొత్త ఆటోలకు పర్మిట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.