హైదరాబాద్, జూన్ 29 (నమస్తేతెలంగాణ): శేర్లింగంపల్లి జోన్ అ ర్బన్ బయోడైవర్సిటీ వింగ్ డిప్యూటీ డైరెక్టర్ అనిల్‌కుమార్ ఉద్యోగోన్నతిపై 3నెలల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. లేదంటే రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వరంగల్ సర్కిల్లో పనిచేస్తున్నప్పుడు నమోదైన ఏసీబీ కేసు విచారణ ముగిసిన తర్వాత కూడా తనకు ఉద్యోగోన్నతి కల్పించలేదంటూ గతంలో అనిల్‌కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని బుధవారం జస్టిస్ టీ మాధవీదేవి విచారణ చేపట్టి చర్యలు చేపట్టాలని హెచ్చరించారు.
గజం జాగనైనా కాపాడే ఉద్దేశముందా? ; భూదాన్బోర్డుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్, జూలై 30, (నమస్తే తెలంగాణ): భూదాన్ భూముల్లో ఒక గజం స్థలాన్నైనా రక్షించాలన్న చిత్తశుద్ధి భూదాన్ బోర్డులో కనిపించడం లేదని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. నాగారం, శంషాబాద్ ప్రాంతాల్లోని భూముల వివాదానికే బోర్డు పరిమితం కాకుండా రాష్ట్రంలోని అన్ని భూదాన్ భూము ల వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. ఎంతమంది దాతలు ఎంత భూమి ఇచ్చారో, ఎంత భూమిని పేదలకు పంచారో, ఇంకా ఎంత భూమి ఉన్నదో, వాటిలో వివాదాలు ఎన్నింటిపై ఉన్నాయో వివరాలు అందజేయాలని ఆదేశించింది. రంగారెడ్డి జి ల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో వివిధ సర్వే నంబర్లలోని భూదాన్ భూముల్లో అవకతవకలు జరిగాయని దాఖలైన పలు పిటిషన్లపై జస్టిస్ కే లక్ష్మణ్ బుధవారం కూడా విచారణ కొనసాగించారు. ఈ సందర్భంగా గురువారం జరిగే విచారణలో తేల్చుతామని హైకోర్టు ప్రకటించింది.