Asha Worker | హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆశ కార్యకర్తలకు సర్టిఫికేషన్ కోసం నిర్వహించే పరీక్షపై తీవ్ర గందరగోళం నెలకొంది. ‘మేం పరీక్ష రాయం’ అం టూ మెజార్టీ ఆశ కార్యకర్తలు తేల్చి చెప్తున్నా రు. పరీక్ష వద్దంటూ ఏకంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేశారు. వైద్యారోగ్య శాఖ మాత్రం ఆశ కార్యకర్తలకు ఈ పరీక్ష త ప్పనిసరి కాదని చెప్తున్నది. కేంద్ర ప్రభుత్వమే సర్టిఫికేషన్ కోర్సు నిర్వహించాలని సూచించిందని పేర్కొన్నది. ఆర్ఎంఎన్సీహెచ్+ఎన్, ఎన్సీడీపై ఒకటి, పాలియేటివ్ కేర్‌పై మరో పరీక్ష ఉంటుందని చెప్తున్నది. ఇందులో ఉత్తీర్ణులైనవారికి రూ.5వేల నగదు బహుమతి ఇస్తున్నట్టు వైద్యశాఖ చెప్తున్నది. ఆసక్తి ఉన్నవారి నుంచి మాత్రమే పేర్లు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది.
అవగాహన కల్పించడంలో విఫలం
రాష్ట్రవ్యాప్తంగా 28 వేల మంది ఆశ కార్యకర్తలు ఉన్నారు. వారికి గతంలో ప్రతి ఆరు నెలలకోసారి శిక్షణనిచ్చేవారు. ఇప్పుడు పరీక్ష రాయాలని చెప్తుండటంతో ఆందోళన మొదలైంది. ఈ పరీక్ష తప్పనిసరి కాదని వివరించడంలో వైద్యశాఖ విఫలమైంది.