హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని వింటర్ నర్సరీ కేంద్రంలో ఆదివారం ‘మేజ్ జర్మ్ ప్లాజం ఫీల్డ్ డే’ నిర్వహించనున్నారు. ఐసీఏఆర్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ మేజ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగనున్నది. ఇందులో దాదాపు 100 మంది మొక్కజొన్న శాస్త్రవేత్తలు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. మొక్కజొన్న పరిశోధనలో పేరుగాంచిన సీఐఎంఎంవైటీ గ్లోబల్ మేజ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ ఆశిశ్సక్సేనా, కంట్రీ ప్రతినిధి డాక్టర్ మహేశ్ గాథాలా పాల్గొని మొక్కజొన్న పెరుగుదల, ఉత్పత్తి పెంపుపై సూచనలు అందించనున్నట్టు వెల్లడించారు.