హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : రైతుల అభివృద్ధికి మక్కజొన్న ముఖ్యమైన పంటగా మారుతున్నదని ఐకార్, ఐఐఎంఆర్ లుథియానా డైరెక్టర్ డాక్టర్ హెచ్ఎస్ జాట్ పేర్కొన్నారు. సోమవారం మక్కజొన్న జర్మ్ప్లాజ్ డేను ఐకార్-ఐఐఎంఆర్ వింటర్ నర్సరీ సెంటర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్లోబల్ మేజ్ డైరెక్టర్ డాక్టర్ ఆశిష్ సక్సేనా మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా నైట్రోజన్ వినియోగ సామర్థ్యం ఉన్న మకజొన్న అభివృద్ధి ఎంతో అవసరమని పేరొన్నారు. సీఐఎంఎంవైటీ ఇండియా కంట్రీ హెడ్ డాక్టర్ మహేశ్ గథాలా మాట్లాడుతూ.. వాతావరణానికి అనుకూలమైన మక్కజొన్న రకాలను వేగంగా అభివృద్ధి చేయాల్సిన అవసరమున్నదని తెలిపారు.
ఐకార్, నారమ్ డైరెక్టర్ డాక్టర్ గోపాల్లాల్ మాట్లాడుతూ.. దేశంలో మకజొన్న ప్రాధాన్యతను వివరించి, శాస్త్రవేత్తల మధ్య ఆరోగ్యకరమైన చర్చలకు వేదికగా ఈ ఫీల్డ్డేను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ ఐకార్, ఐఐఎంఆర్ వింటర్ నర్సరీ సెంటర్ ఇన్చార్జి, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎన్ సునీల్, సీఐఎంఎంవైటీ హైదరాబాద్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ పీహెచ్ జైదీ, ఏఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ చంద్రమోహన్, ప్రముఖ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.