కుట్రదారులెవరినీ వదలం.. బీజేపీకి బుద్ధిచెబుతాం : విప్ గువ్వల బాలరాజు
రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్రలు చేసిన బీజేపీకి బుద్ధిచెప్తామని, ఎవరినీ వదలబోమని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు హెచ్చరించారు. తమను చంపుతామని బెదిరింపు కాల్స్ వస్తుండటంతో ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారమే తాము ప్రగతిభవన్‌లో ఉంటున్నామని చెప్పారు.
- బీజేపీకి బుద్ధిచెబుతాం
- ఇంటెలిజెన్స్ రిపోర్టు మేరకే ప్రగతిభవన్‌లో ఉంటున్నాం
- మమ్మల్ని ఎవరూ నిర్బంధించలేదు
- ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్రలు చేసిన బీజేపీకి బుద్ధిచెప్తామని, ఎవరినీ వదలబోమని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు హెచ్చరించారు. తమను చంపుతామని బెదిరింపు కాల్స్ వస్తుండటంతో ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారమే తాము ప్రగతిభవన్‌లో ఉంటున్నామని చెప్పారు. తమనెవరూ నిర్బంధించలేదని, కావాలనే కొందరు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, కాలమే వారికి సమాధానం చెప్తుందని అన్నారు. మంగళవారం తెలంగాణభవన్ ప్రాంగణంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని బతికించే వారధులుగా తాము ఉన్నామని, సీఎం కేసీఆర్‌కు అందుబాటులో ఉండేందుకే ప్రగతిభవన్‌లో తాము ఉంటున్నామని చెప్పారు.
కుట్రదారుల ఎత్తులను చిత్తు చేస్తామని తెలిపారు. నలుగురు ఎమ్మెల్యేలం ప్రజలకు అందుబాటులోనే ఉన్నామని, ప్రజాసమస్యలపై స్పందిస్తూ వాటిని పరిషరిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్న బీజేపీని ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెడతామని పేర్కొన్నారు. తామంతా సీఎం కేసీఆర్ వదిలిన బాణంలా పనిచేస్తామని తెలిపారు. భవిష్యత్‌లో తెలంగాణ భారత్‌ను కాపాడిందనే ఖ్యాతిని సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తామెంత వరకైనా పోరాడతామని స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేస్తామని చెప్పారు. తమకు బెదిరింపు కాల్స్ వస్తున్న నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

