హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ చరిత్రలో డాలస్‌లో జూన్ 1న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ మైలురాయిగా నిలిచిపోతుందని బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ మహేశ్ తన్నీరు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణీయుల ఆలోచనలకు ప్రతిబింబంగా డాలస్ సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. నాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయాన యూఎస్ఏలో ఉన్న తెలంగాణ పౌరులు ఏ స్థాయిలో ఆరాటాన్ని, ఆసక్తిని చూపించారో అలాంటి ఆసక్తే నేడు డాలస్ సభపై చూపుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో సుదీర్ఘకాలం పోరాడి తెలంగాణను సాధించి, పదేండ్లపాటు అన్ని రంగాల్లో అద్భుతంగా పురోగమించిన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఎన్నారైలు ఏమనుకుంటున్నరు? అనే విషయాన్ని డాలస్ సభ ప్రతిబింబిస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యే పార్టీ రజతోత్సవాల సభా ఏర్పాట్లలో గత 15 రోజులుగా తలమునకలైన ఆయన నమస్తే తెలంగాణకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. ఆ ఇంటర్వ్యూ వివరాలు ఇలా ఉన్నాయి.
మహేశ్ తన్నీరు: చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. అమెరికా సహా అనేక దేశాల్లో బీఆర్ఎస్ ఎన్నారై కమిటీలు నిర్వహించిన సభల్లో ఇదే అతి పెద్దదిగా నిలుస్తుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో నాడు తెలంగాణ కోసం ఉద్యమం సాగుతున్నప్పుడు ఎన్నారైల్లో కనిపించిన ఆసక్తి, ఉత్సాహం ఇప్పుడూ కనిపిస్తున్నది. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ వరంగల్‌లో విజయవంతమైంది. ఆ స్ఫూర్తితో ఇక్కడ మేము ఏర్పాట్లు చేస్తున్నాం. దాదాపు అన్నీ పూర్తి కావచ్చాయి. యూఎస్ఏలో ఉన్నవాళ్లే కాకుండా యూకే సహా ఇతర దేశాల్లో ఉన్న బీఆర్ఎస్ ఎన్నారైలే కాకుండా తెలుగువాళ్లు ఎందరో ఈ సభకు వచ్చేందుకు ఆసక్తిని చూపుతున్నారు. డాలస్‌కు ఎవరెవరు వస్తారు? వచ్చేవాళ్లకు ఏ అసౌకర్యం కలుగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాటికి ఎవరెవరు బాధ్యతలు తీసుకోవాలి? వంటి విషయాలపై ముందే ప్లాన్ చేసుకున్నాం. ఆ ప్రకారమే ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ సభ సక్సెస్ కోసం మాకు సహకారం అందించేందుకు పార్టీ ముఖ్య నేతలు ఎందరో వచ్చేశారు.
జూన్ 1న డాలస్‌లోని డాక్టర్ పెప్పర్ అరినాలో జరిగే సభకు బీఆర్ఎస్ వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఈ ప్రాంగణానికి అనేక విశిష్టతలు ఉన్నాయి. డాలస్‌లో ఇంత పెద్ద ప్రాంగణం మరొకటి లేదు. గతంలో ఇక్కడ ప్రధానమంత్రి మోదీ సభ జరిగింది. ఇప్పుడు ఆ స్థాయిలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఏర్పాట్లు చేస్తున్నాం. డాలస్ సభ విజయవంతం అయ్యాక ఏడాది పొడవునా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని దేశాల్లో ప్రవాస తెలంగాణీయులను కలిసేలా సమావేశాలు నిర్వహించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. అందులో భాగంగా లండన్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, గల్ఫ్ (దుబాయ్)లో సభలు పెట్టాలని అనుకుంటున్నాం.
రెస్పాన్స్ చాలా బాగుంది. మా ఎన్నారై వింగ్‌తోపాటు పార్టీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు దాదాపు 30 మంది అమెరికాలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఉన్న తెలంగాణీయులను కలుస్తున్నారు. ఒక్క బీఆర్ఎస్ ఎన్నారై వింగ్ వాళ్లనే కాకుండా ఇతర తెలుగు అసోసియేషన్లలో ఉన్నవాళ్లు ఎంతోమంది వచ్చి కలుస్తున్నారు. అన్ని రాష్ర్టాల్లో ఉన్న మనవాళ్లు మీటింగ్‌కు వస్తామని చెప్తుంటే సంతోషంగా ఉన్నది. ముఖ్యంగా యూత్, యూఎస్ఏలోని యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులు మీటింగ్‌కు వచ్చేందుకు అమితాసక్తిని చూపుతున్నారు. సభకు వచ్చే ప్రతినిధుల కోసం రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పించాం. అద్భుత స్పందన వచ్చిం ది. అన్ని ప్రాంతాల్లో సన్నాహక సమావేశాలకూ మంచి రెస్పాన్స్ వచ్చింది. బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల స్థానికంగా ఉన్నవాళ్లతో కలిసి సమన్వయం చేస్తున్నారు. జూన్ 1న డాలస్‌లోని డాక్టర్ పెప్పర్ అరినా ప్రాంగణమంతా ఎటుచూసినా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబిస్తాయి. ఆ మేరకు ఏర్పాట్లు చేశాం. యూఎస్ఏతోపాటు ఇతర దేశాల్లో ఉన్న తెలంగాణవాసులు డాలస్ సభపై ఆసక్తిని చూపుతున్నరు.
ఒక రాజకీయ పార్టీ ఒక నాయకుడి ఆలోచనల్లోంచి పుట్టి విజయవంతంగా 25 ఏండ్లు విజయవంతంగా కొనసాగడమే కాకుండా ఏ లక్ష్యం కోసమైతే పార్టీ ఆవిర్భవించిందో ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అరుదైన ఘటన. కేసీఆర్ నాయకత్వంలో 25 ఏండ్ల క్రితం పార్టీ పుట్టడం, ఆ పార్టీ గొడుగు కింద తెలంగాణ రాష్ట్రం సాధించడం, పదేండ్లపాటు ప్రతీ తెలంగాణ బిడ్డ గర్వపడేలా కేసీఆర్ పాలించడం ఇలా అనేక సందర్భాలను సెలబ్రేట్ చేసుకోవడానికి యూఎస్ఏలో ఉన్న తెలంగాణ బిడ్డలం జూన్ 1 కోసం వేయిట్ చేస్తున్నాం. వేలాది మంది ఆసక్తిని చూపుతున్నరు. ఇక్కడ ఉన్న ప్రతీ తెలంగాణ బిడ్డ గర్వపడుతున్నారు. కేసీఆర్ అంటే వారికి అమితాభిమానం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేవలం 10 ఏండ్ల స్వల్ప సమయమే అయినా దేశంలో అన్ని రాష్ర్టాల కన్నా అద్భుతంగా ముందుకు సాగింది. తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పాలన దుష్ప్రరిణామాలపై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇంత స్వల్పకాలంలోనే తెలంగాణ ఇలా కావడాన్ని ఎన్నారైలు జీర్ణించుకోలేకపోతున్నరు.