Home Guards | హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : మహారాష్ట్ర ఎన్నికల బందోబస్తు కోసం వెళ్లిన 3 వేల మంది తెలంగాణ హోంగార్డులు తమకు రావాల్సిన 6 రోజుల బందోబస్తు అలవెన్సు కోసం ఎదురు చూస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికలు ముగిసి మూడు రోజులయినా హోంగార్డులకు బందోబస్తు అలవెన్స్ రాలేదు.
దేశంలో ఒక్క తెలంగాణలో మినహా ఇతర రాష్ర్టాల్లో ఎన్నికల డ్యూటీకి ఎవరైనా హోంగార్డులు వెళ్తే.. డైలీ డ్యూటీ అలవెన్సులను వారి వేతనంతో కలిపి ప్రోత్సాహకాలుగా ఇస్తున్నారని, తెలంగాణలో మాత్రం డైలీ డ్యూటీ అలవెన్స్‌ను కట్ చేసుకుంటున్నారని వాపోతున్నారు. ఇతర రాష్ర్టాల్లో ఇచ్చినట్టుగా బందోబస్తు అలవెన్స్‌ను వేతనంతో కలిపి ప్రోత్సాహకంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.