హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): మాలలను మనువాదులని హేళన చేయటం మందకృష్ణ మాదిగ అహంకారానికి నిదర్శనమని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తల్లమల్ల హుస్సేన్ పేర్కొన్నారు. మాలలపై మందకృష్ణ మాదిగ వ్యా ఖ్యలనుఒక ప్రకటనలో ఖండించారు. మాల లు నిజమైన అంబేద్కర్, ఫూలే వారసులని.. మం దకృష్ణ మాదిగ నిజమైన మను వు వారసుడని ఆరోపించారు. వర్గీకరణ పేరుతో మాది గ జాతిని ఆయన వాడుకుంటున్నారని తెలిపారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, మనువాద, మతవాద పార్టీల పంచన చేరి మాలలను మనువాదులు అనడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఎమ్మెల్యే వివేక్ మూడు పార్టీలు మారారని విమర్శించడం తగదని పేర్కొన్నారు. మాలలపై పెత్తనం చెలాయించినట్టు నియంతృత్వంగా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు.
44 మంది అసిస్టెంట్ సెక్రటరీల బదిలీ
హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): సచివాలయంలో 44 మం ది అసిస్టెంట్ సెక్రటరీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.