ఆస్తి కోసం దారుణం.. మహిళ తల, మొండెం వేరుచేసి హత్య!
మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిలకొండ మండలం చింతల్ తండాలో ఈ దారుణం చోటుచేసుకుంది. పొలం వద్దకు వెళ్తున్న మహిళను భర్త కుటుంబసభ్యులు ఇంటికి తీసుకెళ్లి దాడి చేయడంతోపాటు.. తల, మొండెం వేరయ్యే వరకు నరికి చంపారు.
ఆస్తి వివాదం ఓ మహిళ ప్రాణాలను బలిగొంది. భూమి కోసం భర్త కుటుంబ సభ్యులే దారుణానికి ఒడిగట్టారు. పొలం వద్దకు వెళ్తున్న మహిళను ఇంటికి తీసుకెళ్లి దాడి చేయడంతోపాటు.. తల, మొండెం వేరయ్యే వరకు నరికి చంపారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిలకొండ మండలం చింతల్ తండాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
కోయిలకొండ మండలం చింతల్ తండాకు చెందిన కాట్రావత్ బలరాంకు.. ఓబ్లాయిపల్లి తండాకు చెందిన కాట్రావత్ సునీతతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రిషిక, శైలజ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బలరాంకు మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో దంపతుల మధ్య పలుమార్లు గొడవలు జరిగినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఏడాది క్రితం బలరాం ఇద్దరు అన్నలు మాన్యనాయక్, పాండునాయక్ అతడిని హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. పెద్దమనుషుల తీర్పు మేరకు బలరాంకు చెందిన ఎకరంన్నర భూమిని సునీత పేరుపై కుటుంబ సభ్యులు రిజిస్ట్రేషన్ చేయించారు. భర్త హైదరాబాద్‌కు వెళ్లడంతో సునీత తన ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింట్లో ఉంటోంది.
ఇటీవల ఆమె తిరిగి చింతల్ తండాకు వచ్చి పొలం వద్దకు వెళ్తుండగా మాన్యనాయక్ అడ్డగించి తమ ఇంటికి తీసుకెళ్లినట్లు సమాచారం. అక్కడ అప్పటికే ఉన్న మరో సోదరుడు పాండునాయక్, అతని భార్య పార్వతి, మాణిక్యనాయక్ అనే మరో వ్యక్తి సునీతపై దాడి చేశారు. ఆమె తల, మొండెం వేరయ్యే వరకు నరికి హత్య చేశారు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆస్తి కోసం దారుణం.. మహిళ తల, మొండెం వేరుచేసి హత్య!
AP News | పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అధికార కూటమికే ఆధిక్యం..!
Jagtial Child | ‘అమ్మా.. నన్ను తీసుకెళ్లు.. భయమేస్తోంది’.. వీడియో వైరల్.. చివరకు తల్లిదండ్రుల చెంతకు బాబు!
Ramayana | ‘రామాయణ’కు పైరసీ భయం.. కీలక ఆదేశాలు జారీ చేసిన ముంబై హైకోర్టు!
Glenn Maxwell: అంతర్జాతీయ క్రికెట్‌కు గ్లెన్ మ్యాక్స్‌వెల్ గుడ్‌బై.. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

