Glenn Maxwell: అంతర్జాతీయ క్రికెట్‌కు గ్లెన్ మ్యాక్స్‌వెల్ గుడ్‌బై.. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు
Glenn Maxwell: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. 14 ఏళ్లు సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌కు అతను ముగింపు పలికారు. వాస్తవానికి 2025లో వన్డే క్రికెట్‌కు మ్యాక్స్‌వెల్ రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ టీ20 జట్టుకు అందుబాటులో ఉన్నాడు.
సిడ్నీ: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్(Glenn Maxwell).. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. 14 ఏళ్లు సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌కు అతను ముగింపు పలికారు. 38 ఏళ్ల ఆ క్రికెటర్ చివరిసారి 2026 టీ20 వరల్డ్‌కప్‌లో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. ఆ మ్యాచ్‌లో అతను రెండు వికెట్లు తీశాడు. కానీ బ్యాటింగ్ చేయలేదు. ఆస్ట్రేలియా తరపున మెక్స్వెల్ మొత్తం 149 వన్డేలు, 130 టీ20లు, ఏడు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 2015, 2023లో వన్డే వరల్డ్‌కప్ గెలిచిన ఆస్ట్రేలియా బృందంలో అతను ఉన్నాడు.
ఆస్ట్రేలియా జట్టులో చాన్నాళ్లు కీలక ప్లేయర్‌గా మ్యాక్స్‌వెల్ కొనసాగాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో అతను ప్రత్యేకతను సంతరించుకున్నాడు. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో అతను ఆఫ్ఘనిస్తాన్పై డబుల్ సెంచరీ చేశాడు. వన్డేల్లో 3990 రన్స్ చేశాడు. వాటిల్లో స్ట్రయిక్ రేట్ 126.7గా ఉంది. ఇక టీ20ల్లో 2897 రన్స్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో మ్యాక్స్‌వెల్ ఖాతాలో మొత్తం 10 సెంచరీల ఉన్నాయి. మూడు ఫార్మాట్లలో కలిపి అతను 136 వికెట్లు తీసుకున్నాడు.
వాస్తవానికి 2025లో వన్డే క్రికెట్‌కు మ్యాక్స్‌వెల్ రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ టీ20 జట్టుకు అందుబాటులో ఉన్నాడు. 2026 టీ20 వరల్డ్‌కప్‌లో అతను ఆడాడు. టీ20ల్లో మ్యాక్స్‌వెల్ పేరిట అయిదు సెంచరీలు ఉన్నాయి. బీబీఎల్‌లో మెల్బోర్న్ స్టార్స్‌కు మరో సీజన్ ఆడనున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Glenn Maxwell: అంతర్జాతీయ క్రికెట్‌కు గ్లెన్ మ్యాక్స్‌వెల్ గుడ్‌బై.. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు
Radhika Apte | టాలీవుడ్ కథలపై రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు.. ‘లెజెండ్’ సినిమాను ఉద్దేశించేనా, నెటిజన్ల ఘాటు కౌంటర్లు!
Indian Navy | సముద్ర దొంగల ఆటకట్టించిన ఇండియన్ నేవీ.. ఇరాన్ ఫిషింగ్ షిప్, 20 మంది సిబ్బంది సేఫ్ రిలీజ్..!
Mahesh Babu | గేమింగ్ రంగంలోకి సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ‘టేక్‌డౌన్: జెనెసిస్’తో కొత్త ప్రయాణం!
Helicopters Collide: నేపాల్‌లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

