కవ్వాల్ ; కవ్వాల్ టైగర్ రిజర్వు, తిప్పేశ్వర్ ఫారెస్ట్‌లో పులుల దర్శనం ఆనందంగా ఉన్నదని ఎంపీ సంతోష్‌కుమార్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అడవుల్లో పచ్చదనం పెంచడంతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకుంటుండటంతో అవి స్వేచ్ఛగా విహరిస్తున్నాయని చెప్పారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఇది సీఎం కేసీఆర్ ముందు చూపు ఫలితం అని కొనియాడారు.