Tirupati : మద్రాస్ హైకోర్టు (Madras High Court) న్యాయమూర్తి జస్టిస్ నాగార్జున (Justice Nagarjuna), నమస్తే తెలంగాణ (Namaste Telangana) తెలుగు దినపత్రిక వైస్ ప్రెసిడెంట్ చిరంజీవి (Chiranjeevi) కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
అంతకుముందు తిరుమల శ్రీవారి ఆలయానికి చేరుకున్న జస్టిస్ నాగార్జున, చిరంజీవి కుటుంబసభ్యులను ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతించారు. ఆ తర్వాత వేదమంత్రాలతో ఆశీర్వదించారు.