హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 21 (నమస్తే తెలంగాణ): మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ నాయకురాలు మాధవీలత మంగళవారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతికి ఫిర్యాదు చేశారు. తన మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రభాకర్‌రెడ్డి మాట్లాడాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.