హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 20 ( నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారిగా 2014 బ్యాచ్‌కు చెందిన మాధవ్ రచయ్య సల్ఫులే సోమవారం సికింద్రాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఆర్పీవో జొన్నలగడ్డ స్నేహజ చైనాకు బదిలీకావడంతో ఆమె స్థానంలో మాధవ్ బాధ్యతలు చేపట్టారు.