హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : ఎం ఫార్మసీ, ఫార్మా -డీ(పీబీ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు వెబ్ కౌన్సెలింగ్ గురువారం నుంచి ప్రారంభమవుతుందని ప్రవేశాల కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు.
ఈ నెల 9 నుంచి 11 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, 13న అర్హులైన అభ్యర్థుల జాబితా ప్రదర్శిస్తామని, అదే రోజు ఈ-మెయిల్ ద్వారా తప్పులను సవరించుకోవచ్చని పేర్కొన్నారు. 14, 15న వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చని, 16న వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్ ఉంటుందని, 21న సీట్లను కేటాయిస్తామని తెలిపారు. సీట్లు పొందిన వారు 25లోపు రిపోర్ట్చేయాలని సూచించారు.
హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : సింగరేణి సంస్థలో మరో 6 నెలలు సమ్మెలపై సర్కారు నిషేధం విధించింది. తెలంగాణ తప్పనిసరి సర్వీసెస్ మెయింటెనెన్స్ చట్టం- 1971 ప్రకారం సమ్మెలపై నిషేధం విధిస్తూ ఇంధనశాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులిచ్చారు. సెప్టెంబర్ 11 నుంచి 6 నెలలు ఉంటుందని స్పష్టంచేశారు.