ధూప, దీప, నైవేధ్య పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు సీఎం కేసీఆర్ వేతనాలు పెంచడం హర్షణీయమని ధూప, దీప, నైవేద్య పథకం, అర్చక నైవేద్య సంఘం(డీడీఎన్) రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవశర్మ, గౌరవ సలహాదారుడు చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వ స్వామి ఆలయ ప్రధానార్చకుడు పీ రామలింగేశ్వరశర్మ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం నల్లగొండలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీరంగం గోపీకృష్ణమాచార్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నంబొట్ల ఫణికుమార్శర్మ, రాష్ట్ర కోశాధికారి నందనం హరికిషన్శర్మ, శివస్వామి పరమేశ్వర పాల్గొన్నారు.
హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): విప్రహిత బ్రాహ్మణ సదన్ నిర్మాణం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త అధ్యాయానికి నాంది పలికిందని బ్రాహ్మణ సమాజం కొనియాడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలను సమదృష్టితో చూస్తూ ఇతర నాయకులు, రాజకీయ పార్టీలకు ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించింది. దేశంలో ఓటుబ్యాంకు రాజకీయాలు నడుస్తున్న ప్రస్తుత తరుణంలో పేదరికంలో మగ్గిపోతున్న బ్రాహ్మణ సమాజాన్ని బాగుచేయాలని నిర్ణయించడం ఎంతో ధైర్యంతో కూడిన విషయమని అభినందించింది. ఇతర పార్టీలకు ఇదో గుణపాఠం వంటిదని పేర్కొన్నది. అభివృద్ధి, సంక్షేమంలో అందరినీ కలుపుకొని పోవాలనే సందేశాన్ని కేసీఆర్ ఇచ్చారని బ్రాహ్మణ ప్రముఖులు వ్యాఖ్యానించారు.
అందరినీ సమంగా చూసే ఒకే ఒక్కడు కేసీఆర్
దేశవ్యాప్తంగా బ్రాహ్మణుల గురించి ఆలోచించిన ఏకైక నేత కేసీఆర్. బ్రాహ్మణులు పేదరికంలో మగ్గిపోతున్నా పార్టీలు కనీస మానవత్వం కూడా చూపని ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ ఒక్కడే వారికోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. అత్యంత ఖరీదైన ప్రాంతంలో బ్రాహ్మణుల కోసం సదన్ నిర్మించడం ఆషామాషీ కాదు. సంక్షేమం విషయం లో కేసీఆర్ను ఇతర పార్టీలు, నా యకులు ఆదర్శంగా తీసుకోవాలి.
– విఠలాచార్యులు, శ్రీశైలం జ్యోతిర్లింగ క్షేత్ర ప్రధాన అర్చకుడు
విప్రహిత భవనం అద్భుతం
గోపనపల్లిలో సీఎం కేసీఆర్ ప్రారంభించిన విప్రహిత భవనం అద్భుతం. అర్చకులు, బ్రాహ్మణుల పట్ల ముఖ్యమంత్రి చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు బ్రాహ్మణులందరం రుణపడి ఉంటాం. అనువంశిక అర్చక సమస్యల పరిష్కారం పట్ల హామీ ఇచ్చిన సీఎంకు ధన్యవాదాలు. పేద బ్రాహ్మణులకు తోడ్పాటు అందిస్తున్న ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
-రామలింగేశ్వరశర్మ, చెర్వుగట్టు శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయం ప్రధాన అర్చకుడు
విప్రహిత ఎవరూ చేయని సాహసం
ఏ నాయకుడూ చేయని సాహసాన్ని సీఎం కేసీఆర్ చేసి విప్రహితను ప్రారంభించడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం. ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం జన్మజన్మల పుణ్యం. ఐఐటీ, ఐఐఎంలలో చదివే పేద బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలుచేయడం హర్షనీయం. పేద బ్రాహ్మణుల జీవితాల్లో మార్పు కోసం సీఎం చేస్తు న్న కృషి ఎనలేనిది. బ్రాహ్మణ వ ర్గం కేసీఆర్ సేవలను ఎన్నటికీ మరువదు.
– శ్యాంమోహన్శర్మ, మహా భాగ్యనగర్ బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షుడు
బ్రాహ్మణుల అభ్యున్నతికి కేసీఆర్ హామీపై హర్షం
రాష్ట్రంలో బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడం పట్ల ఆలయాల పరిరక్షణ ఉద్యమ కన్వీనర్ చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు సీఎస్ రంగరాజన్ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం మొయినాబాద్లో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం బ్రాహ్మణ సదన్ భవ నం నిర్మించడం సంతోషకరమని చెప్పారు. ప్రతి నెల అర్చకులకు ఇ చ్చే భృతిని రూ. 2500 నుంచి రూ.5 వేలకు పెంచడం, అర్హత వయసును 65 ఏండ్లకు తగ్గించడం అభినందనీయమని చెప్పారు.
తెలంగాణను చూసి ఇతర రాష్ర్టాలు నేర్చుకోవాలి
సోషల్ మీడియాలో బ్రాహ్మణ సమాజం ప్రశంసల జల్లు
తెలంగాణను చూసి ఇతర రాష్ర్టాలు నేర్చుకోవాలని ట్విట్టర్ వేదికగా వివిధ రాష్ర్టాలకు చెందిన బ్రాహ్మణ సమాజం ప్రశంసల జల్లు కురిపించింది. బ్రాహ్మణ సమాజానికి చెందిన పలువురు ప్రముఖులు, సంస్థలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వా న్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ను పొగడ్తలతో ముంచెత్తారు. ‘తెలంగాణాలో బ్రాహ్మణుల జనాభా 3-4% ఉంటుంది. అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటుబ్యాంకు గురించి ఆలోచించకుండా బ్రాహ్మణుల సంక్షేమానికి కృషిచేస్తున్నారు. ఉత్తరప్రదే శ్, ఉత్తరాఖండ్, హర్యానా తదితర రాష్ర్టాల్లో బ్రాహ్మణుల జనాభా 10-14% ఉ న్నప్పటికీ అక్కడ వారి గురించి పట్టించుకునే నాథుడు లేడు. దీనికి ప్రధాన కార ణం నాయకుల మానసిక స్థితి. ఫలితంగా బ్రాహ్మణ కులం తీవ్ర నిరాదరణకు గురవుతున్నది.’ అంటూ ప్రముఖ బ్రాహ్మణ సమాజ సంస్థ ‘ది బ్రాహ్మిణ్ వాయిస్’ ట్వీట్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం బ్రాహ్మణుల సంక్షేమం కోసం అమలుచేస్తు న్న సంక్షేమ పథకాలతో కూడిన ‘అమర్ ఉజాలా’ పత్రిక ప్రకటనను ట్యాగ్ చేస్తూ బ్రాహ్మిణ్ వాయిస్ ఈ మేరకు వ్యాఖ్యానించింది. ‘తెలంగాణలో బ్రాహ్మణ సదనాల నిర్మాణం ద్వారా బీజేపీ చేయలేని పనిని తెలంగాణ ప్రభుత్వం చేసి చూపిం ది. బ్రాహ్మణులు స్వయం సమృద్ధి సాధించేందుకు అక్కడి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు దేశంలో బ్రాహ్మణుల అభివృద్ధికి ఓ ముందడుగు. అన్ని పార్టీలు బ్రాహ్మణులను తూలనాడుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ధైర్యం గా వారి అభివృద్ధికి పాటుపడటం అభినందనీయం’ అంటూ శుభంశర్మ ట్వీట్ చేశారు.