పుదుచ్చేరి, చెన్నై మీదుగా ప్రయాణించి తిరిగి వైజాగ్‌కు
పర్యాటకుల ఆసక్తి
హాట్‌కేకుల్లా అమ్ముడైన టికెట్స్
11 అంతస్థులతో కార్డెలియా క్రూజ్ నౌక నిర్మాణం
హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): పర్యాటకులకు సముద్రంలో విహరించే అవకాశం కల్పిస్తున్న కార్డెలియా క్రూజ్ నౌక బుధవారం విశాఖపట్నం పోర్టుకు చేరుకొన్నది. దీంతో చాలా మంది పర్యాటకులు చెన్నైకి వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకొన్నారు. కార్డెలియో క్రూజ్ కంపెనీ నిర్వహిస్తున్న ఈ నౌక.. హిందూ మహాసముద్ర తీరం వెంబడి ప్రయాణిస్తూ విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై మీదుగా ప్రయాణించి తిరిగి విశాఖపట్నం చేరుకొంటుంది. విశాఖపట్నం నుంచి చెన్నైకి ప్రయాణించేందుకు ఈ షిప్‌కు 36 గంటల సమయం పడుతుందని నిర్వాహకులు తెలిపారు.
కార్డెలియా క్రూజ్ విశేషాలు