Southwest Monsoons | 16న అండమాన్కు ‘నైరుతి’.. బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం
నైరుతి రుతుపవనాలు ఈ నెల 16నాటికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతంలో ప్రవేశించే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
- వచ్చే రోజుల్లో ఉష్ణోగ్రతలు గరిష్ఠస్థాయికి
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ) : నైరుతి రుతుపవనాలు ఈ నెల 16నాటికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతంలో ప్రవేశించే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బుధవారం తీవ్ర అల్పపీడనంగా మారిందని పేర్కొన్నది. గురువారం నుంచి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నదని వెల్లడించింది. ఈనెల 22 వరకు భానుడు తన ప్రతాపాన్ని చూపుతాడని హెచ్చరించింది.
గడిచిన 24 గంటల్లో నిజామాబాద్లో అత్యధికంగా 44.5 డిగ్రీలు, జగిత్యాల జిల్లా బీర్పూర్లో 44.4, కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 44.2, సిద్దిపేట జిల్లా కోహెడలో 43.9, నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లో 43.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వివరించింది. వచ్చే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వడగాల్పులు ఎక్కువగా ఉంటా యని 11 గంటల తర్వాత బయటకు వెళ్లే సమయాల్లో తగిన జాగ్రత్తలు తీ సుకోవాలని సూచించింది. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఈ వారంపాటు జాగ్రత్తగా ఉండాలని కోరింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

