హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): మనం నిత్యం వాడే నీటిని తక్కువ ఖర్చుతో మినరల్ వాటర్గా మార్చే అధునాతన పరికరాన్ని తెలంగాణ యువ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనాథ్ బొలిశెట్టి తయారు చేశారు. నీటిని వృథా చేయకుండా ఈ పరికరంతో అన్ని రకాల మినరల్స్ గల స్వచ్ఛమైన నీటిని తయారు చేసుకోవచ్చని ఆయన చెప్తున్నారు. ‘బ్లూ యాక్ట్ స్మార్ట్ మల్టీప్యూర్ 2.0’ పేరుతో తయారు చేసిన ఈ పరికరాన్ని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సోమవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆర్వో ప్యూరిఫయర్లకు ప్రత్యామ్నాయంగా కేవలం రూ.5 వేలకే స్మార్ట్ మల్టీప్యూర్ 2.0’ను అందుబాటులోకి తెచ్చినట్టు శ్రీనాథ్ తెలిపారు.
స్మార్ట్ మల్టీప్యూర్ 2.0 ప్రత్యేకతలు