గురువారం 21 జనవరి 2021
Telangana - Jan 04, 2021 , 17:04:38

అంధుల ఆరాధ్యదైవం లూయీస్‌ బ్రెయిలీ : మంత్రి కొప్పుల

అంధుల ఆరాధ్యదైవం లూయీస్‌ బ్రెయిలీ : మంత్రి కొప్పుల

హైదరాబాద్‌ : అంధుల ఆరాధ్యదైవం లూయీస్‌ బ్రెయిలీ అన్ని సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. లూయిస్ బ్రెయిలీ 212వ జయంతి సందర్భంగా సోమవారం మలక్‌పేటలోని ఆర్థిక సహకార సంస్థ కార్యాలయంలో లూయిస్ బ్రెయిలీ విగ్రహానికి  ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి వర్చువల్ సమావేశాన్ని ప్రారంభించి మాట్లాడారు. కళ్లు లేని వారి కన్నీళ్లు తుడిచి అక్షరజ్ఞానం అందించి వారి తలరాతను మార్చిన మహోన్నత వ్యక్తి బ్రెయిలీ అని కొనియాడారు.

సంస్థ ప్రాంగణంలోని బధిరుల ఉన్నత పాఠశాలను ఏదో సంస్థకు అప్పగిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. ఇది మీకోసమే ఏర్పాటు చేశారని యథాతధంగా కొనసాగుతుందని హామీ ఇవ్వడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తంచేస్తూ చప్పట్లు కొట్టారు. బ్రెయిలీ జయంతి వేడుకల్లో దివ్యాంగులు, వయోవృద్ధులు, మాతా శిశుసంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి దివ్యా దేవరాజన్, దివ్యాంగుల ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, కమిషనర్ శైలజ, జనరల్ మేనేజర్ ప్రభంజన్ రావులతో పాటు అంధులు, దివ్యాంగులు పాల్గొన్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo