రాంనగర్, డిసెంబర్ 24: వాట్సాప్‌కు వచ్చిన లింక్ ఓపెన్ చేసిన ఓ చిరువ్యాపారి రూ.6లక్షలు పోగొట్టుకున్న ఘటన కరీంనగర్‌లోని టవర్ సర్కిల్లో జరిగింది. ఈ నెల 17న సైబర్ అఖిల్ వాట్సాప్‌కు నేరగాళ్లు లింక్ పంపారు. ఓపెన్ చేయగా, గ్లోబల్ మారెట్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే రెట్టింపు డబ్బులు వస్తాయని నమ్మించారు. దీంతో అఖిల్ వెయ్యి, 2వేలు ఇన్వెస్ట్ చేయగా, 6,600 అఖిల్ ఖాతాలో జమచేశారు. ఇది నమ్మిన అఖిల్ దఫదఫాలుగా రూ.5.90 లక్షలు పంపించారు. దీనికి రెట్టింపు డబ్బు కావాలంటే మరో రూ.5లక్షలు ఇవ్వాలని సూచించడంతో బంగారాన్ని కుదువపెట్టేందుకు మంగళవారం బ్యాంకుకు వెళ్లాడు. మేనేజర్‌కు గ్లోబల్ మార్కెటింగ్ గురించి చెప్పగా, ఇదంతా మోసమని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేశారు.