హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): మునుగోడులో టీఆర్ఎస్కు తెలంగాణ రాష్ట్ర లారీ యజమానుల అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపుకోసం గడపగడపకు వెళ్లి ప్రచారం చేస్తామని యజమానులు వెల్లడించారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచిరెడ్డి రాజేందర్‌రెడ్డి, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చాంద్‌పాషా, తెలంగాణ స్టేట్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు నందారెడ్డి, ప్రధాన కార్యదర్శి సుర్వి యాదయ్యగౌడ్ ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం మునుగోడులో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కలి సి మద్దతు ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించిన అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పరిషారం కానీ ఎన్నో సమస్యలను స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సహకారంతో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ కృషితో పరిషారమయ్యాయన్నారు. కృతజ్ఞతగా రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో ఈ నెల 22న సమ్మేళనం నిర్వహిస్తున్నామని తెలిపారు. మంత్రిని కలిసినవారిలో సలీం, లింగస్వామిగౌడ్, రాధాకృష్ణ, రాంరె డ్డి, బాల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, లింగన్నగౌడ్ తదితరులు ఉన్నారు.