భువనగిరి కలెక్టరేట్ ; యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని నయారా పెట్రోల్ బంకుకు ఆదివారం వచ్చిన లారీ డీజిల్ ట్యాంక్ ఒకసారిగా పగిలిపోవడంతో మంటలు ఎగిసిపడ్డాయి. పెట్రోల్ బంకు సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఫైర్ సిలిండర్ల సహాయంతో మంటలను ఆర్పివేశారు. ఒక్కసారిగా వచ్చిన మంటలతో పెట్రోల్ బంకులోని వాహనదారులు భయంతో పరుగులు తీశారు. పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.