తొర్రూరు, డిసెంబర్ 1 : కొనుగోలు కేంద్రాల్లో కాంటాలైన ధాన్యం తరలింపునకు అధికారులు తిప్పలు పడుతున్నారు. లారీలు అందుబాటులో లేకపోవడంతో రహదారిపై లారీను ఆపి కొనుగోలు కేంద్రాలకు మళ్లిస్తున్న ఘటన ఆదివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పాలకేంద్రం సెంటర్ ఖమ్మం-వరంగల్ ప్రధాన రహదారిపై జరిగింది.
కొనుగోలు కేంద్రాల్లో కాంటాలైన ధాన్యం తరలింపునకు వాహనాలు రాకపోవడంతో ఆర్టీఏ, రెవెన్యూ, పీఏసీఎస్, సివిల్ సప్లయ్ అధికారులు రంగంలోకి దిగారు. ఖమ్మం-వరంగల్ ప్రధాన రహదారిపై వచ్చే లారీలను మరి ఆపి ధాన్యం కొనుగోలు కేంద్రాల వైపు మళ్లించారు. గుత్తేదారు వాహనాలను కేంద్రాలకు పంపించకపోవడంతో కేంద్రాల్లో కాంటాలైన ధాన్యం నిల్వ అధికారులకు తలవొప్పిగా మారింది.