టెన్త్‌లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
టెన్త్ విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి కార్యాలయంలో డీఈవోలు, ఇంజినీర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి
- జిల్లాల వారీగా కార్యాచరణ ప్రణాళిక
- తరచూ మోడల్ పరీక్షల నిర్వహణ
- మన ఊరు-మన బడి పనుల్లో రాజీవద్దు
- సమీక్షలో మంత్రి సబితాఇంద్రారెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 24 : టెన్త్ విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి కార్యాలయంలో డీఈవోలు, ఇంజినీర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. పదో తరగతి విద్యార్థుల కోసం జిల్లాలవారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రశ్నపత్రంలో చాయిస్‌లు, ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలను పెంచడంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని, తరచూ మోడల్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. సర్కారీ విద్యను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని గుర్తుచేశారు. మన ఊరు – మన బడి పథకం విజయవంతానికి అధికారులు అందరూ కృషిచేయాలని సూచించారు. ఈ పథకంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయని తెలిపారు. ఈ పనుల నిర్వహణలో ఇంజినీరింగ్ అధికారులు రాజీపడకుండా పనిచేయాలని సూచించారు. నిర్దేశించిన సమయంలోనే నాణ్యతతో పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, తెలంగాణ విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి కార్యదర్శి ఎండీ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

